నారాయణరావుపేట , అక్టోబర్ 8 ,(ప్రజాజ్యోతి):విద్యార్థుల చదువుకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు గ్రామ ప్రజాప్రతినిధులుగా అన్ని విధాలా సహకారం అందిస్తామని నారాయణరావుపేట గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.నారాయణరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, ఉపాధ్యాయులతో కలిసి సర్పంచ్ ఎల్లారెడ్డి విద్యార్థులకు బూట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత ఫలితాలు సాధించి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవసరాల విషయంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు గ్రామ ప్రజాప్రతినిధులుగా తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
