రైతు గోస వినేందుకు బీజేపీ కదలిక.. గజ్వేల్‌లో భాజపా నేతల భారీ పర్యటన

Bharath Gowd
1 Min Read

తూప్రాన్ ప్రజాజ్యోతి మే 25:

మెదక్ లోకసభ పరిధిలో రైతు సమస్యలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్గంటి రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన నాయకులు పంటల కొనుగోలు, సాగు ఖర్చులు, ఎరువులు, నీటి సమస్యలు, ధాన్యం నిల్వలు వంటి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు.రైతు సంక్షేమమే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతుకు అండగా నిలబడే పార్టీ బీజేపీయేనని నాయకులు స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ, గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *