నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో అనాథ మరియు తల్లిదండ్రులు వదిలివేసిన శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఊయలను గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిశువులను రోడ్లపై పడేయకుండా ఈ ఊయలలో ఉంచితే ప్రభుత్వం ద్వారా సంరక్షిస్తామని తెలిపారు. అంతకుముందు బస్టాండ్‌లో దత్తతపై అవగాహన కల్పించి, ఎంపీడీవో కార్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, ఎంపీడీవో మొజం హుస్సేన్, ఏరియా ఆస్పత్రి వైద్యులు విష్ణువర్ధన్, ఎస్సై రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
