నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఈ నెల 29 నుండి పెట్రోల్ ధరలు సుమారు 15 నుండి 20రూ పెరుగుతాయనే వదంతులతో సోమవారం నర్సాపూర్‌లోని బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి వాటర్ టిన్నులు, బాటిళ్లలో ఇంధనాన్ని నింపుకుంటున్నారు. ధరల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రజలు ‘పానిక్ బయింగ్’తో కృత్రిమ కొరత సృష్టించవద్దని, వదంతులు నమ్మి ఆందోళన చెందరాదని బంక్ నిర్వాహకులు స్పష్టం చేశారు.
