నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు చట్టపరమైన నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీడీఎస్ సూపర్వైజర్లు శివకుమారి, మెహత అన్నారు. గురువారం నర్సాపూర్ ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులకు దత్తత ప్రక్రియపై వారు అవగాహన కల్పించారు. పసిబిడ్డలను రోడ్లపై వదిలేయకుండా, పెంచలేని వారు ఏరియా ఆసుపత్రి ఊయలలో ఉంచితే ప్రభుత్వం వారి బాధ్యత తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రయాణికులు పాల్గొన్నారు.
