Rangareddy Bureau
1 Min Read

*ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంటి కల నెరవేర్చిన కాంగ్రెస్*

పామెన భీమ్ భరత్

చేవెళ్ల ప్రజా జ్యోతి

పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. నవాబ్‌పేట్ మండలం కుమ్మరిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైనా, ఏనాడైనా పేదల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సొంత ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఆషాకిరణంగా మారాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్‌పేట్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బి-బ్లాక్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, యావాపూర్ సర్పంచ్ లక్ష్మణ్, పులుమామిడి సర్పంచ్ నరసింహులు, యాదయ్య, మల్లేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్, గ్రామ సర్పంచ్ గోపాల్ కృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *