నర్సాపూర్ (ప్రజాజ్యోతి) స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం ‘మే’డే వేడుకలు ఘనంగా జరిగాయి. డిపో ప్రాంగణంలో ఆర్టీసీ రిటైర్డ్ ట్రాఫిక్ ఇంచార్జ్ మాటూరి శాఖయ్య జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. కార్మిక ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో వెంకట్ గౌడ్, నాగరాజు గౌడ్, శ్రీనివాస్, గోపాల్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
