ప్రత్యేక ఓటరు సవరణ 

Kamareddy
1 Min Read

ప్రత్యేక ఓటరు సవరణ

— తాసిల్దార్ ఉమలత

రామారెడ్డి జూన్ 25 (ప్రజా జ్యోతి)

ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంకెన్స్ రివిజన్ సర్వేను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సవరణ ప్రక్రియ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, జాబితాలో తప్పులను సరిదిద్దడం.జూన్ 25 నుండి బిఎల్ఓ లు ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం జరుగుతుంది. మీ ఓటరు కార్డులో మార్పులు లేదా కొత్త ఓటు నమోదు కోసం ఓటరు సవరణ ఫారం 6 కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండిన వారు. ఫారం 7 ఓటర్ల జాబితా నుండి పేరు తొలగించడానికి ఫారం 8 పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోటో మార్పులు చేసుకోవడానికి, మరియు ఒకే నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ నుండి వేరొక దానికి మారడానికి.ఆన్‌లైన్‌లో సవరణ చేసుకునే విధానం.మీ ఇంటికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్ కు నేరుగా దరఖాస్తులు అందజేసి కూడా మీ ఓటును సవరించుకోవచ్చు. పూర్తి సమాచారం లేదా సందేహాల కోసం మీ దగ్గరలోని బిఎల్ఓ ను లేదా సంబంధిత ఓటరు జాబితా కార్యాలయము సందర్శించి ఓటర్ సవరణ ప్రక్రియను సవరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఉమలత, గ్రామ జిపిఓ దుర్గాప్రసాద్, బిఎల్ఓ వనిత, మంజుల, సంబంధిత ఓటరు మహిళలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *