- జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
నిజాంసాగర్, మే 28 ప్రజా జ్యోతి
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జాతీయ రహదారి 161లో ఆగి ఉన్న డీసీఎంను మరో డీసీఎం వెనుక నుండి ఢీకొంది. పిట్లం వైపు నుంచి జహీరాబాద్ వెళుతున్న ఓ డీసీఎం ఒక్కసారిగా టైర్లు పగిలిపోవడంతో బుధవారం తెల్లవారుజామున రహదారిపై నిలిచిపోయింది. అదే రహదారిలో వేగంగా వస్తున్న మరో డీసీఎం అదుపుతప్పి దాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరియు హెల్పర్ స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని డీసీఎంలను జాతీయ రహదారిపై నుండి తొలగించారు.