తస్మా జాగ్రత్త… పట్టుబడితే అంతే…
డ్రంక్ అండ్ డ్రైవ్ మరింత కట్టుదిట్టం…
వారం రోజుల్లో 151 కేసులు…
రూ.10.40 లక్షల జరిమానా…
సీపీ సాయి చైతన్య…
నిజామాబాద్ క్రైం, ప్రజాజ్యోతి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 151 నమోదు కాగా కోర్టులు రూ.10.40 లక్షల జరిమానా విధించినట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన 1 వారంలో డ్రంకన్ డ్రైవ్ లో 151 మంది పట్టు బడగా వారిని నిజామాబాదు , బోధన్ మరియు అర్మూర్ కోర్టులలో వారిని హాజరు పర్చగా ఇందులో 11 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని మిగిలిన వారికీ *10,40,000/- జరిమానా* విధించనైనది. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తములో త్రాగి వాహనములు నడిపి పోలీస్ వారికి పట్టుబడటం జరుగుచున్నది, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా తేది:04-5-2026 నుండి తేది: 08-5-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 151 కేసుల నమోదు చేయడం జరిగింది. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడును. మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ మరియు వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడును అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదు. ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడును. *మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019)* అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడును. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును అని చెప్పారు.
