ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ నగర శివారులోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన లయన్స్ క్లబ్స్ ఎంపవర్ రీజియన్ 7 మీట్* లో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో లయన్ విజయానంద్ కు ఉత్తమ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ అవార్డు అందుకున్నరు. ఇట్టి అవార్డు ను ఎంపోవర్ రీజియన్ 7 చైర్మన్ లయన్ అనిల్ పటేల్ మరియు ప్రత్యేక అతిథి లయన్ ప్రకాష్ రావు అందచేశారు. ఇట్టి అవార్డు రావడానికి మంచి కార్యక్రమాలు చేసి తనకు సహకరించిన వారి జోన్ లోని లయన్స్ క్లబ్బ్స్ ఇందూర్, కామారెడ్డి, కామారెడ్డి వివేకానంద, సదాశివనగర్ అధ్యక్షులు మరియు సభ్యులకు ధన్యవాదములు తెలిపినారు.