నెక్కొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నెక్కొండ, ఏప్రిల్ 14 (ప్రజా జ్యోతి)::
నెక్కొండలో నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా హక్కులు, కార్మిక సంక్షేమం మరియు బీసీ వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన కృషిని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నక్షత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సింగం అరుణ్, అడ్వకేట్ బండి శివకుమార్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
