సంగెం, పిబ్రవరి19 (ప్రజాజ్యోతి):
మండలంలోని నల్లబెల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాటలు పడుతూ చైతన్యం కల్పించారు.18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు పొందాలని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన ఓటు హక్కుతో ప్రజా సేవకోసం పరితపించే నాయకుణ్ణి ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ జూపాక శివ, సభ్యులు హింగే అరవింద్ కుమార్, రామంచ భారత్, అంకం రామనాథం, కండకట్ల రామకృష్ణ, ఇల్లందుల సతీష్, రాజు, మరములా ఆనందం, ఈటెల సమ్మన్న, మాటేటి అనిత, మైదంఝాన్సీ, గుగులోతు శాలిని, మేకల విజయ, జడల హరిత తదితరులు పాల్గొన్నారు