టీవీఎస్ మోటార్ సైకిల్ అమ్మకాల్లో సూర్యాపేట టాప్  షో రూమ్ లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన షోరూం నిర్వాహకులు 

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10(ప్రజాజ్యోతి): టీవీఎస్ మోటార్ సైకిల్ అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట లక్ష్మీ సాయి టీవీఎస్ షోరూం 2025-26 సంవత్సరములో మార్కెట్ షేర్ గైన్ లో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని లక్ష్మీ సాయి టీవీఎస్ షో రూమ్ లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా మోటార్ సైకిల్ లను అందించడంతోపాటు ఉత్తమమైన మైలేజ్ వాహనాలను లక్ష్మీ సాయి టీవీఎస్ షోరూం నిర్వాహకులు అందిస్తున్నారని అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాల్లో సైతం అత్యుత్తమమైన వాహనాలను టీవీఎస్ వారు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. మోటార్ సైకిల్ విక్రయాల్లో లక్ష్మి సాయి టీవీఎస్ షోరూం సూర్యాపేట ఆర్టిఏ లో 3.9% మార్కెట్ షేర్ గైన్ సాధించడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు కర్నాటి నాగేశ్వరరావు, టెరిటరీ మేనేజర్ రవితేజ, సేల్స్ జిఎం శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిశేట్టి లక్ష్యాది, కక్కిరేణి చంద్రశేఖర్, పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, నాయకులు రాచకొండ శ్రీనివాస్, పడిదల రవి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *