బాధిత కుటుంబాలను పరమర్చించిన మాజీ ఎమ్మెల్యే షిండే

Kamareddy
1 Min Read

ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది ఆగస్ట్ 18

పెద్దకొడపగల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులుబడెసాబ్, జూనియర్ అసిస్టెంట్ బాలయ్య కుటుంబాన్నీ మాజీ ఎమ్మెల్యే షిండే పరామర్శించారు.గతవారం రోజులు క్రితం గుండె పోటుతో వీరిద్దరూమరణించారు.ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్థానిక నాయకులతో కలసి తమ నివాసనికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు.బాలయ్య,బడేసాబ్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు మనోదైర్యంగా ఉండాలని మీకు ఎలాంటి సమస్యలు వచ్చిన స్థానిక నాయకులు అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి,సతీష్ యాదవ్,బిజెపి మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ సింగ్,మహ్మద్,మండలనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *