- కాలభైరవ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
రామారెడ్డి మే 24 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రం
శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం ఇస్సన్నపల్లి, రామారెడ్డి, మండల కేంద్రంలో కొలువై ఉన్న దక్షణ కాశి గా విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రం లో వైశాఖమాసం అనంతరం ఆలయంలోని హుండీలను శనివారం హుండీలు విప్పడమైనది. స్వామివారి హుండీ ఆదాయం 2,72,759/- రూపాయలు మాత్రమే లెక్కింపు చేశామని మిశ్రమ బంగారం 0-40 గ్రాములు,,0.980 గ్రాముల వెండి, సుమారు మొత్తం ధన రూపేనా 8-680-0 గ్రాములు హుండీ లలో భక్తులు కాలుకలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం నందు జిల్లా సహాయ కమిషనర్ వి విజయరామారావు, కార్యనిర్వాణాధికారి ప్రభు గుప్తా, అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీ శర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ సవార్డినేటర్ నాగరాజు, సహాయకులు భరత్, మరియు భక్త బృందం మహిళా సంఘం వాసవి వారు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.