జీలుగ పెద్ద జనుము విత్తనాల పంపిణీలో జాప్యం..?
* మండల కేంద్రంలో రైతుల డిమాండ్?
* ప్రభుత్వం సబ్సిడీ గత సంవత్సరం ధరలకు అందించాలి
రామారెడ్డి మే 24 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో ఇప్పటి వరకు పెద్దజనము జీలుగా విత్తనాల పంపిణీ చేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే వ్యవసాయ సహకార సంఘం ద్వారా, మరి ఇతర సొసైటీల ద్వారా త్వరగా విత్తనాలను పంపిణీ చేయాలని రైతులు కోరారు. ఇప్పటికే పక్క జిల్లాలలో పంపిణీ ప్రక్రియ గత వారం రోజుల నుండి ప్రారంభించారు. కావున ఇప్పటికైనా రామారెడ్డి మండల కేంద్రానికి జీలుగా జనుము పంపిణీ చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా వాతావరణం దృశ్య ముందుగానే రుతుపవనాలు సంభవించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించినందున రైతులు ఆందోళన,చెందుతున్నారుస్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు,వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి త్వరగా విత్తనాలను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.