గ్రామాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి
* ఎస్సై శివకుమార్
నిజాంసాగర్ మే 29 ప్రజాజ్యోతి
నేరాలను అరికట్టేందుకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మర్పల్లి గ్రామంలో సీసీ కెమెరాలను గ్రామస్తులు నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గురువారం ఎస్సై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఎస్సై శివకుమార్ మాట్లాడారు.. ప్రతి గ్రామంలో జరుగుతున్న నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కొన్ని గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను ఉంటే వాటిని త్వరగా బాగు చేయించుకోవాలని గ్రామాల ప్రజలను కోరారు.