బీసీ సంక్షేమ సంఘం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల్ యాదవ్…

Nizamabad Bureau Sanjeev Yedla
2 Min Read

బీసీ సంక్షేమ సంఘం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల్ యాదవ్…

 

నిజామాబాదు అర్బన్, ప్రజాజ్యోతి, మే 28 :

 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్టు సంగి గోపాల్ యాదవ్ నియమితులయ్యారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు గురువారం ఆయనకు జిల్లా కేంద్రం గీత భవన్లో బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, రాజకీయ ప్రాధాన్యత, విద్యా మరియు ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. బీసీ జేఏసీ చైర్మన్ పీ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు, ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంఘటిత శక్తితోనే హక్కులు సాధించుకోవచ్చని అన్నారు.

*జర్నలిస్టుగా ప్రజా సమస్యలకి పరిష్కారం తెలుసు : గోపాల్ యాదవ్*

నూతనంగా నియమితులైన సంగి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ 19 ఏళ్లుగా జర్నలిస్టుగా పని చేసిన అనుభవం వల్ల ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో అనుభవం ఉంది అన్నారు. బిసి లు ఇప్పుడు రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. సంఘ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, బీసీ జేఏసీ కో ఛైర్మన్స్ పుప్పాల రవి, ఎండల ప్రదీప్, సోమ హనుమంత్ రావు, చింతకాయల రాజు, లక్ష్మణ్ శివాజీ రావు, నవాతే ప్రతాప్, కో కన్వీనర్ నరేందర్, బీసీ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *