పెళ్లికి వెళ్తే ఇళ్లు గుల్ల
జాన్కంపేటలో దొంగల బీభత్సం
ప్రజాజ్యోతి నిజామాబాద్ క్రైమ్:
ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాన్కంపేటకు చెందిన భాస్కర్ ఇల్లు ప్రధాన రహదారి పక్కడే ఉంటుంది. అయితే తన అన్న కొడుకు వివాహం ఉండడంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్కు వెళ్లాడు. అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడిన రూ.12 లక్షల విలువైన సొత్తును అపహరించుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.