నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం గజ్వేల్ డిపో ఆర్టీసీ బస్సును బోర్ వెల్ లారీ బలంగా ఢీకొ
ట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ భాగం ధ్వంసం కాగా, ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
