- రామచంద్రపూర్ గ్రామంలో ఘటన
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాంచద్రపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సార స్వామి (42) గత పదేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. గత ఆరు నెలలుగా అనారోగ్యం తీవ్రమవ్వడంతో పనికి వెళ్లలేక మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు తువాలుతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించారు.
