-
అధికారులకు, మీడియా కు సౌకర్యాలు కల్పించడంలో విఫలం
-
జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళనున్న జర్నలిస్టులు
అగ్రంప్పాడు / ప్రజాజ్యోతి::
అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరలో ఈవో నారాయణ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అధికారులను, మీడియా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీడియా వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లిన్నప్పటికి మీడియా పాయింట్ వద్ద కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఈవో నామ మాత్రంగా బ్యానర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం కూర్చోవటానికి కుర్చీలు, ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయలేదు.
జాతరలో ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వసతులు కల్పించడం లేదని జిల్లా వైద్య అధికారి ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో గ్రౌండ్ మ్యాట్, పవర్ సప్లై, సీలింగ్ క్లాత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. జిల్లా వైద్యాధికారి మందలించినప్పటికీ ఈవో నాగేశ్వర్ రావు తన పద్ధతి మార్చుకోకుండా.. అధికారులను, జర్నలిస్టులను, భక్తులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈవో తీరుపై మీడియా ప్రతినిధులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

