వరంగల్ సిటీ, మార్చి 12 (ప్రజాజ్యోతి):
ఆత్మహత్యకు యత్నించిన యువకుడు
– కాపాడిన మట్వాడ పోలీసులు
వ్యక్తిగత సమస్యలతో రెండంతస్తుల భవనం పైకి ఎక్కి ఆత్మహత్య తీసుకోవాలని ప్రయత్నించిన యువకుడిని మట్టేవాడ పోలీసులు కాపాడిన ఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే వరంగల్ నగరంలోని ఎల్లం బజార్ కు చెందిన కట్కోజు శివకుమార్ అనే వ్యాపారి వ్యక్తిగత సమస్యలతో స్థానిక మహబూబియా పంజేతన్ కాలేజీ ఎదురుగా ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ పైకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన మట్టేవాడ బ్లూ కోర్టు సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా ఆ వ్యక్తిని బిల్డింగ్ పై నుంచి కిందికి దించి రక్షించి సురక్షితంగా తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో నగర ప్రజలు మట్టేవాడ పోలీసు సిబ్బంది మరియు ఫైర్ సిబ్బందిపై హర్షం వ్యక్తం చేశారు.