సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి): ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని 43వ వార్డు నెహ్రూ నగర్ లో వీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేముల పవన్ కళ్యాణ్ లక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.గత పది సంవత్సరాలుగా వీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాత వేముల వీరబాబు మల్లీశ్వరి,ఉత్సవాల సహకార దాతలు, యూత్ సభ్యులు, నాయకులు,వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
