ఆత్మకూరు, మార్చి 7 (ప్రజాజ్యోతి):
మహిళా పంచాయితీ కార్యదర్శులకు ఘనంగా సన్మానం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన మహిళా పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని మహిళా పంచాయతీ సెక్రటరీ లను మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి రంగంలో మహిళ అత్యున్నత స్థానంలో ఉంటూ, గృహములో గృహిణిగా ఉంటూ ప్రతి రంగంలో రాణిస్తున్న మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా పంచాయతీ కార్యదర్శులు శ్వేత, అనూష, సృజన, అరుణ, కళ్యాణి, అమిత, సంధ్య, లావణ్య, సంపూర్ణ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏం శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడు రాజు, ఇతర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.