దామెర, మార్చి 02 (ప్రజాజ్యోతి):
జాతీయ స్థాయి మాథ్స్ పోటీల్లో ల్యాదల్ల ‘వికాస్ స్కూల్’ విద్యార్థి విజేతగా నిలిచాడు. ఆదివారం హైదరాబాద్ లో విశ్వం ఎడ్యుటెక్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి అబాకస్ వేదిక్ మాథ్స్ పోటీల్లో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దామెర మండలం ల్యాదల్ల గ్రామంలోని వికాస్ హై స్కూల్ కు చెందిన బి అయాన్ రెండవ తరగతికి చెందిన విద్యార్థి స్టార్ జూనియర్ లెవెల్ వన్ లో మూడవ బహుమతి గెలుచుకోవడం జరిగింది. విశ్వం ఎడ్యుటెక్ సీఈవో సతీష్ మరియు ప్రశాంత్ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అబాకస్ టీచర్ ప్రణయ, వికాస్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఎండి అక్బర్, శ్రీజ, యాకూబ్ పాషా మొదలగు వారు పాల్గొన్నారు.