నర్సంపేట పట్నంలోని సరోజినీ దేవి రోడ్డు లో నివాసం ఉంటూ ఆటో మెకానిక్ గా పనిచేస్తున్న పుల్లూరి కర్ణాకర్ అనుకోకుండా యాక్సిడెంట్లో మరణించడం జరిగింది, కర్ణాకర్ కుటుంబాని మిత్రుడు వంగపండ్ల రాజు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాన్ని పరామర్శించారు, కరుణాకర్ నిత్యం జీవన ఉపాధి కోసం ఆటో మెకానిక్ గా పని చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు, పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి బాసరగా నిలవాలని తన వాట్సాప్ స్టేటస్ ద్వారా కరుణాకర్ కుటుంబ నేపథ్యాన్ని మిత్రులకు తెలియజేయగా వారి సహకారంతో 16300 రూపాయలు వచ్చినది, వచ్చినటువంటి రూపాయలను స్నేహితులతో కలిసి వారి కుటుంబ సభ్యులకు అందించారు, మిత్రుడి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు,పేద కుటుంబానికి అండగా నిలిచినటువంటి స్నేహితులందరికీ రాజు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆకుల మహేందర్,వైనల రాజేష్, గుర్రం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.