- ప్రజా జ్యోతి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని
వర్ధన్నపేట జనవరి 20, ప్రజాజ్యోతి::
ప్రజా జ్యోతి దినపత్రిక 2026 సంవత్సరం నూతన క్యాలెండర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆవిష్కరించారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వర్ధన్నపేట ప్రజా జ్యోతి రిపోర్టర్ మహమ్మద్ రఫీ తో కలిసి ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా సీనియర్ నాయకులు వర్ధన్నపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తూళ్ల రవి, మాజీ కౌన్సిలర్ సమ్మెట సుధీర్, జిల్లా నాయకులు మన్నే బాబురావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

