వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం – వైద్యం వికటించి బాలింత మృతి..

Warangal Bureau
2 Min Read

వరంగల్ సిటీ, మార్చి 11 (ప్రజాజ్యోతి):

వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం

– వైద్యం వికటించి బాలింత మృతి
– మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
– ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
– ఆసుపత్రి గేటు మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించని వైనం

వరంగల్ ఎంజీఎం సమీపంలోని క్యూర్ వెల్ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో జరిగింది. వివరాలలోకెళితే హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన జినుకల ప్రవళిక (25) నిండు గర్భంతో కాన్పు కోసం ఆదివారం రాత్రి 8 గంటలకు క్యుర్ వెల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. గర్భిణీకి అన్ని రకాల పరీక్షలు చేసి సోమవారం ఉదయం 9 గంటలకి డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. 10 గంటలకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆడపిల్ల పుట్టింది తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అర్థగంట గడవకముందే ప్రవళిక కు తీవ్ర రక్త స్రావం కావడం ప్రారంభమైంది. వెంటనే వైద్యులు మరల ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి సుమారు 15 యూనిట్ల రక్తము ఎక్కించడం జరిగింది. అయినను రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో వైద్యులు ప్రవళిక కు గర్భసంచి తొలగిస్తేనే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని కుటుంబ సభ్యుల చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా అంబులెన్స్ ను రప్పించి ప్రవళికను అనుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో భయాందోళనకు గురైన ప్రవళిక సోదరుడు ప్రవీణ్ మా అక్కను చెప్పకుండా ఎక్కడకు తీసుకువెళ్తున్నారని హుటాహుటిగా అంబులెన్స్ వద్దకు పరిగెత్తే క్రమంలో మెట్ల పైనుంచి జారిపడి కాలు విరగడం జరిగింది. అయినా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోకుండా ప్రవళికను హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. తీరా అక్కడికెళ్లాక ప్రవళిక మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన ప్రవళిక భర్త రాజు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్యూర్ వెల్ ఆస్పత్రి వైద్యులను అడగగా మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఖచ్చితంగా ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మాకు సరైన న్యాయం చేయాలని ఆస్పత్రి నందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరంగల్ ఏసిపి నందిరం నాయక్ ఆసుపత్రి వద్దకు వచ్చి ఏలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *