నర్సాపూర్ (ప్రజాజ్యోతి) బాలికలు ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునేలా ఆత్మరక్షణ విద్యలను రక్షణ కవచాలుగా మలచుకోవాలని పుర చైర్మన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ పేర్కొన్నారు. విజేత ఉన్నత పాఠశాలలో మెదక్ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన కిక్ బాక్సింగ్, కర్రసాము వేసవి శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ వేడుకలకు పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్‌తో కలిసి హాజరైన వీరు, విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ప్రతినిధులు నాగరాజు, శేఖర్, కౌన్సిలర్లు శ్రీకాంత్, నిరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
