మూగబోయిన ‘ప్రయాణ’ ప్రాంగణం!

Bharath Gowd
1 Min Read
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}
  • ఆర్టీసీ సమ్మెతో వెలవెలబోయిన నర్సాపూర్ బస్టాండ్
  • డిపోలకే పరిమితమైన బస్సులు.. ప్రయాణికుల పాట్లు

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నిత్యం వందలాది మంది ప్రయాణికులతో, బస్సుల హారన్లతో కళకళలాడే నర్సాపూర్ ప్రయాణ ప్రాంగణం బుధవారం వెలవెలబోయింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ప్రభావంతో బస్సు చక్రం ఆగింది. తమ న్యాయమైన వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

ఎదురుచూపులే మిగిలాయి..
ఎప్పుడూ కిటకిటలాడే బస్టాండ్ నేడు ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది. బస్సు వస్తుందేమో అన్న ఆశతో వచ్చిన కొద్దిమంది ప్రయాణికులు గంటల తరబడి వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు. రవాణా వ్యవస్థ స్తంభించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యం సందడిగా ఉండే బస్టాండ్ ఇలా మూగబోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, కార్మికుల సమస్యను త్వరగా పరిష్కరించి, సామాన్యుడి రవాణా కష్టాలను తీర్చాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *