సయ్యద్ పల్లి దర్గా ఉర్సులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

పరిగి, ఏప్రిల్ 20 (ప్రజాజ్యోతి):
పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామంలో నిర్వహించిన హజ్రత్ సయ్యద్ అబ్దుల్ హుస్సేన్ సాని ఉర్సు వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గంధోత్సవంలో పాల్గొని అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ సయ్యద్ అబ్దుల్ హుస్సేన్ సాని దర్గా ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అరవింద్ రావు పంతులు, సయ్యద్పల్లి వెంకటయ్య కౌన్సిలర్లు, మీర్ తాహేర్ అలీ, వారాల రవీందర్, రవికుమార్, శివనోళ్ల భాస్కర్, మిదిగడ్డ శ్రీనివాస్,ఆనం ఆంజనేయులు,శశాంక్ రెడ్డి నరేష్ యాదవ్,సంజీవ్ , రాములుతదితరులు పాల్గొన్నారు.
