తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని, బైక్‌ను ఢీకొన్న కారు

Bharath Gowd
0 Min Read

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి పెద్ద చింతకుంట గేటు వద్ద తన ద్విచక్ర వాహనాన్ని ఆపి, బస్టాండ్‌లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి రాంగ్ రూట్‌లోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని, ఆపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *