వైశ్య సారథికి అభినందనల వెల్లువ!

Suresh Goud
1 Min Read
  • అమరవాదికి నర్సాపూర్ వైశ్యుల ఘన సన్మానం

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమరవాది లక్ష్మీనారాయణకు నర్సాపూర్ నియోజకవర్గ ఆర్యవైశ్య సమాజం ఘనంగా నీరాజనం పలికింది. శనివారం హైదరాబాద్‌లోని హస్తినాపురం జి.ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నర్సాపూర్ నుంచి వైశ్య ప్రముఖులు, సభ్యులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణను నర్సాపూర్ ప్రతినిధులు శాలువాతో సత్కరించి, అభినందనల జల్లు కురిపించారు. ఆయన నాయకత్వంలో ఆర్యవైశ్య మహాసభ మరింత బలోపేతం కావాలని, సమాజ అభివృద్ధికి ఆయన మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్యవైశ్య ప్రతినిధులు దుద్యాల విట్టల్ గుప్తా, నూక శ్రీనివాస్, బచ్చు వెంకటేష్ గుప్తా, బోర్లప్ శ్రీనివాస్ గుప్తా, ఇమ్మడి శ్రీనివాస్ గుప్తా, రవీందర్ గుప్తా, అశోక్ గుప్తా, విజయ్ గుప్తా, జొన్నవాడ మల్లేశం గుప్తా, గందె ప్రభు శంకర్ గుప్తా, రేఖ సతీష్ గుప్తా, మిరియాల ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *