‘ఇస్రో యువికా 2026’ కు ఎంపికైన ఎంజేపి విద్యార్థిని..
ఆత్మకూరు, ఏప్రిల్ 18 (ప్రజాజ్యోతి):
ఇస్రో యువికా 2026కు ఎంజేపి విద్యార్థినీ ఎంపికైంది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఎంజేపీ పెద్దాపూర్ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థిని దయ్యాల సహస్ర ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభా వంతులైన విద్యార్థుల ఎంపికలో భాగంగా సహస్ర ఎంపికైనట్లు పేర్కొన్నారు. దీంతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో 15 రోజుల శిక్షణలో పాల్గొననున్నట్లు తెలిపారు. ‘ఇస్రో యువికా 2026’ కు ఎంపికైన విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
