వరి కొనుగోలు కేంద్రంను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Kamareddy
1 Min Read

వరి కొనుగోలు కేంద్రంను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రామారెడ్డి ఫిబ్రవరి 17 (ప్రజాజ్యోతి)

రామిరెడ్డి మండలంలోని పోషనిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని సమీక్షించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అధికారులకు సూచించారు.ప్రతి వరి సంచికి 40.600 కిలోల తూకం ఉండేలా ఖచ్చితంగా కొలవాలని ఆయన ఆదేశించారు. తూకం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,అనంతరం సన్న దాన్యం నాణ్యతను మిషన్ ద్వారా పరీక్షించి, తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే కేంద్రంలో మౌలిక సదుపాయాలు, తాగునీరు, నిల్వ సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, dm శ్రీకాంత్, dco రామ్మోహన్, mro ఉమలత, పంచాయతీ సెక్రెటరీ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *