విధుల్లోనే విషాదం.. గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి..

Warangal Bureau
1 Min Read

విధుల్లోనే విషాదం.. గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

పర్వతగిరి, మార్చి 30 (ప్రజాజ్యోతి)::

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. మండలంలోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ (46) సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు హాజరయ్యారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆయనను నెక్కొండలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *