*ఫాతిమా మాత ఉత్సవాలు ప్రారంభం*
*ఓరుగల్లు పీఠ పాలనాధికారి ఫాదర్ డి విజయపాల్ రెడ్డి*
వరంగల్ కలెక్టరేట్ మార్చి 11 (ప్రజా జ్యోతి):
ఫాతిమా మాత శాంతి ప్రదాత లోకాన్ని రక్షించిన ఫాతిమా మాతను ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ కతోలిక పీఠ పాలనాధికారి డి. విజయపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు మంగళవారం కాజీపేట మీడియా పాయింట్ లో ఫాతిమా మాత ఉత్సవాల కరపత్రాలు విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫాదర్ కాసు మర్రెడ్డి, డి. విజయపాల్ రెడ్డి లు సంయుక్తంగా మాట్లాడుతూ 73 సంవత్సరాలుగా ఫాతిమా మాత ఓరుగల్లు పీఠమును, విశ్వాసులను క్రీస్తు వైపు నడిపిస్తూ దేవుని సహాయం కోరుతూ తమ దీవెనలు కురిపిస్తూ ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం మరియ తల్లి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోబుతున్నామని అన్నారు. ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు ఫాదర్ టీ. జోసెఫ్, డి. జోసెఫ్ ల చే ఉదయము నుంచి సాయంత్రం వరకు స్వస్థత ప్రార్థనలు, దివ్య బలి పూజ మహా రథయాత్ర సాయంత్రం సాంస్కృత కార్యక్రమాలు ఉంటాయన్నారు 13 న ఫాదర్ బాలరాజు ఎస్ సి ఐ సిఐ వరంగల్ యూనిట్ ప్రెసిడెంట్ చే మహోత్సవ పూజ స్వస్థత ప్రార్థనలు దివ్యబలి పూజ అనంతరం పతాక అవరోహణ తో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా మాత చర్చ్ విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి మీడియా ఇంచార్జ్ ఫాదర్ అను కిరణ్, ఫాదర్ సురేందర్, టిడి టామీ, హృదయ భాస్కర్, కే. ప్రవీణ్ రెడ్డి, కే. రాజు, జి. క్రాంతి కుమార్, ఎస్. క్రిస్టెఫర్ తదితరులు పాల్గొన్నారు.
