సేవకురాలిగా వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి
– బిజెపి అభ్యర్థి అత్తెలి మనీషా అనంత్ రెడ్డి
చేవెళ్ల ఫిబ్రవరి 03(ప్రజా జ్యోతి):
సామాజిక సేవలో ముందున్నా.. ప్రజా సేవకు అంకితమౌతా.. ఒక్క సారి అవకాశం ఇచ్చి 12 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపించాలని బిజెపి అభ్యర్థి అత్తెలి మనీషా అనంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా అత్తెలి మనీషా అనంత్ రెడ్డి మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో తమను ఒక్కసారి ఆశీర్వదించి 12 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపిస్తే.. ప్రజాసేవకు అంకితమౌతామని కోరుతున్నారు. 12 వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో వార్డును అభివృద్ధి పరచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

