ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డి, జనవరి -26 (ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో మండలంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు గ్రామపంచాయతీలు, అంగన్వాడి, ప్రజా సంఘాలు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. సోమవారం మండలంలో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహరెడ్డి జాతీయ పతకాన్ని ఎగురావేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మున్సిఫ్ కోర్ట్ కార్యాలయంలో న్యాయమూర్తి సుష్మ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో తహెరా బేగం , తహశీల్దార్ కార్యాలయం నందు, తహశీల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహేష్, డీఏస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాస్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రాజారెడ్డి ,పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ బొజ్జ మహేష్, మానవ విద్య వనరుల కార్యాలయంలో ఎంఈఓ రాజులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ నిజాం, ఆటవిశాఖ కార్యాలయంలో రేంజ్ అధికారి చరణ్ తేజ్, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ ప్రెసిడెంట్ రవీంద్ర మోహన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డితో పాటుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసి రాజ్యాంగ విశిష్టతను వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పలు శాఖ అధికారులు మాట్లాడుతూ…స్వాతంత్రం అనంతరం 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అప్పటినుంచి భారత్ ఒక గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఆ చరిత్ర ఆత్మక్షణం నుంచే రాజ్యాంగం దేశానికి మార్గం నిర్దేశం న్యాయం, స్వచ్ఛ, సమానత్వం, అనే మూల సూత్రాలతో దేశాన్ని నడిపిస్తుందన్నారు. మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాది ప్రజల చేత ప్రజల కోసం ప్రజల ద్వారా పాలనను అందించడానికి ఇది మార్గ నిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
