ఈదులు కూడా చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడ, జనవరి 09,(ప్రజాజ్యోతి):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులుగుడా చౌరస్తా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సిమెంట్ ట్యాంకర్, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ నుండి గుంటూరు కు డీసీఎంలో టైల్స్ తరలిస్తుండగా, లారీ ఢీ కొట్టడం తో టైల్స్ కూలీల మీద పడడంతో అక్కడిక్కక్కడే ముగ్గురు మృతి.మరో ముగ్గురి పరిస్థితి విషమం, క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
క్రేన్ సహాయంతో రహదారిపై నుండి లారీని డీసీఎంని తొలగించిన పోలీసులు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ పోలీసులు.
