- పశువుల కాపరులకు అటవీ అధికారుల సూచనలు
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మండల పరిధిలోని నత్నయపల్లి గ్రామ శివారులో ఆదివారం అడవి జంతువు దాడిలో ఒక దూడ మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను సేకరించి, హైనాగా నిర్ధారించారు. అధికారులు మాట్లాడుతూ.. రైతులు, కాపరులు తమ పశువులను ఊరికి దూరంగా పంట చేలల్లో ఉంచొద్దని, రక్షణ కంచె ఉన్న ప్రాంతాల్లో, గ్రామానికి సమీపంలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అటవీ సెక్షన్ అధికారి సాయిరాం, బీట్ అధికారి రజిని ఉన్నారు.
