వరంగల్ లో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం 

Warangal Bureau
1 Min Read

ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం

బయో, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దు

తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుర్ల

హన్మకొండ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 27,( ప్రజా జ్యోతి):

డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్లు సోమవారం బంద్ నిర్వహించారు. వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.జాతీయ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నారని తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎఫ్ ఓ ఎల్ విధానం, లింక్ ప్రొడక్ట్స్ బలవంతపు విక్రయం, మార్జిన్ పెంపు, హెచ్ టి బిటి కాటన్, ఎక్స్‌పైరీ స్టాక్స్ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *