వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ

Kamareddy
1 Min Read

వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ

— ఇద్దరు నిందితుల అరెస్టు

రామారెడ్డి మార్చ్ 24 (ప్రజాజ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని రెడ్డి పెట్ గ్రామానికి చెందిన గడిల బైరయ్య తండ్రి ముకుందం,వడ్లూరు గ్రామానికి చెందిన కల్లూరు పరువయ్య తండ్రి లక్ష్మయ్య లు కలిసి ఈనెల 22/3/26 న మాచారెడ్డి మండల చౌరస్తా ప్రాంతంలో అడిగే రాజవ్వ భర్త బాలయ్య (62) కులం ముదిరాజ్ తన ఇంటి నుండి చౌరస్తాకు బ్యాగు కొనుగోలుకు వచ్చి తిరిగి ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో పై ఇద్దరు వ్యక్తులు ఆమెను చూసి ఆమె దగ్గరికి వెళ్లి వారు వచ్చిన బైకును ఆమె దగ్గర ఆపి ఆమెను బలవంతంగా నీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వు లేదంటే చంపేస్తాము అని బెదిరించి,బాధితురాలు వద్ద నుండి 5000/- రూపాయలు బలవంతంగా తీసుకొని అదే బైకు పై అక్కడి నుండి పారిపోయినారు ఇట్టి విషయం లో ఫిర్యాదురాలైన రాజవ్వ 23/3/26 రోజున మాచారెడ్డి పి ఎస్ నందు ఫిర్యాదు ఇవ్వగా ఇట్టి విషయంలో కేసు నమోదు చేసి వ్యక్తులను పట్టుకొని మంగళవారం కోర్టు నందు హాజరు పరిచయం జరిగింది. వారి దగ్గర నుండి 3000/- రూపాయలు రికవరీ,బైకు, ఒక సెల్ ఫోన్, రికవరీ చేయడం జరిగింది. అని ఎస్సై అనిల్ కుమార్ తెలపడం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *