నిషేదిత అల్ఫ్రజోలమ్ కలిగి ఉన్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు
కామారెడ్డి ప్రజాజ్యోతి ప్రతినిధి మార్చి 31
తేదీ 29.03.2025 నా నమ్మదగిన సమాచారం మేరకు బిచ్కుంద సీఐ నరేష్ తన సిబ్బంది తో కలసి మద్నూర్ గ్రామం లోని ఉదాతలవర్ సురేష్ గౌడ్ కుల వృత్తి నిర్వహించు వారి ఇంట్లో బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ ఉత్తర్వుల ప్రకారం సోదాలు చేయగా ప్రభుత్వం చే నిషేధించబడిన మత్తు పదార్థం అయిన ఆల్ఫాజోమ్ 110 గ్రాములు లభించిందనీ మద్నూర్ ఎస్సై విజయ్ తెలిపాడు. అన్నారు. ఇట్టి ఆల్ఫాజోమ్ ను కల్లులో కలపగా ఎక్కువ మత్తు వస్తదని తెలిపినాడు. వెంటనే సురేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తాను ఇట్టి అల్ఫ్రజోలమ్ ను దినేష్ కుమార్ మొహంతి హైదరాబాద్ లోని నాచారంలో గల వ్యక్తి వద్ద కొనుగోలు చేసినాడు అని తెలిపినాడు. వెంటనే సురేష్ గౌడ్ తో సహ బిచ్కుంద యస్ఐ తన సిబ్బందితో కలసి హైదరాబాద్ లోని నాచారం వద్ద గల టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ వద్దకు వెళ్ళి, అక్కడ దినేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగ ఇట్టి నిషేదిత అల్ఫ్రజోలమ్ ను కృష్ణ వద్ద కొని కొంత లాభంతో ఇతరులకు అమ్ముతాను అని బొడ్డు కృష్ణ అనే వ్యక్తిని కూడా చూపించాడు. తాను కృష్ణ వద్ద కొనుగోలు చేసిన అల్ఫ్రజోలమ్ ను మద్నూర్ లోని సురేష్ గౌడ్ తో పాటు మద్నూర్ ఈనాడు విలేఖరి అయిన శ్రీనివాస్ గౌడ్ కు వివిద సందర్బాలలో అమ్మినట్లు తెలిపినాడు.
తదుపరి బొడ్డు కృష్ణని అదుపులోకి తీసుకొని విచారించగ నాచారం లోని టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ నందు 8 రకాల ముడి సరకులను ఉపయోగించి ప్రభుత్వ నిషేధిత అల్ఫ్రజోలమ్ ను తయారు చేస్తానని చెప్పాడు. అదే విధంగా తాను తయారు చేసిన అల్ఫ్రజోలమ్ ను దినేష్ అనే వ్యక్తికి తక్కవ దరకు అమ్మగా పెద్ద మొత్తం లాభంతో అతడు ఇతరులకు అమ్ముతాడు అని తెలిపినాడు. చట్టప్రకారం పంచుల సమక్షంలో అట్టి నిషేదిత అల్ఫ్ప్రోజోమ్ ను స్వాధీన పరచుకొని నేరస్తులపై ఇట్టి విషయంలో మద్నూర్ పోలీసు వారు నేరం సంఖ్య Cr No 58/2025 U/s 8(c), 22(c), 29 NDPS act కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింధని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల వివరాలు మద్దూరు మండల కేంద్రానికి చెందిన సురేష్ గౌడ్, ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు అన్నారు, మేడ్చల్ కు చెందిన దినేష్ కుమార్, హైదరాబాద్ క చెందిన
బొడ్డు కృష్ణ ఈ నిందితుల దగ్గర నుండి స్వాధీన పరుచుకున్నవి
A1 దగ్గర నుండి అల్ప్రజోలం (110 గ్రాములు) మరియు ఒక మొబైలు ఫోన్
A2 దగ్గర ఒక మొబైలు ఫోన్
A3 దగ్గర నుండి అల్ప్రజోలం (153 గ్రాములు) , 4 మొబైలు ఫోనులు, (8 రకాల ముడి సరకులు)
(ఎ -1 నుండి ఎ – 3 లను అరెస్ట్ చేసి రిమాండ్ కొరకు కోర్టు ముందు హాజరుపర్చబడును, ఎ – 4 అయినా మద్దో ఈనాడు విలేఖరి శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉన్న మద్నూర్ ఈనాడు విలేఖరి శ్రీనివాస్ గౌడ్ ను త్వరలో పట్టుకుంటామన్నారు. జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఇట్టి కేసులో ముందస్తు సమాచార సేకరణ నుండి నేరస్తుల అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వరకు చాకచక్యంగా వ్యవహరించిన మద్నూర్ యస్ఐ విజయ్, బిచ్కుంద సిఐ నరేష్, బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ లతోపాటు సిబ్బందిని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అభినంధించరాన్నారు. ఈ సందర్బంలో ఎస్పి కామారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో నీషేదిత మత్తు పదార్థాలు కలిగి వున్న, సరఫరాచేసిన, అమ్మిన, వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.