నర్సాపూర్ (ప్రజాజ్యోతి) గర్భిణులు, బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి సూచించారు. సోమవారం రైతు వేదికలో ‘మహిళా సంక్షేమ వారోత్సవాలు’ ప్రారంభించిన ఆమె, పౌష్టికాహార ప్రదర్శనను పరిశీలించి ‘పోషణ్’ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగా.. మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, కౌన్సిలర్లు, మెడికల్ ఆఫీసర్ సాయి దీప్తి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
