ఎమ్మెల్యేను కలిసిన గ్రామ పాలకవర్గం 

Kamareddy
1 Min Read

ఎమ్మెల్యేను కలిసిన గ్రామ పాలకవర్గం

— సర్పంచ్ డోకి లచ్చయ్య

రామారెడ్డి ఏప్రిల్ 01(ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండలం ఇసనపల్లి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం కొలువుదీరిన సందర్భంగా గ్రామ అభివృద్ధి దృశ్య పలు అభివృద్ధి సంక్షేమ పథకాల కొరకు నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామంలోని నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం, అదేవిధంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నూతన పైప్ లైన్, ముఖ్యంగా వేసవి సమీపిస్తున్న సందర్భంగా నీటి కొరత లేకుండా గ్రామ పాలకవర్గానికి సహకరించాలని బుధవారం ఎమ్మెల్యేను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోకి లచ్చయ్య, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *