ప్రశాంతంగా కోనసాగుతున్న పోలింగ్.. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్..

Warangal Bureau
1 Min Read

ప్రశాంతంగా కోనసాగుతున్న పోలింగ్..

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్..

పరకాల, ఫిబ్రవరి 11, (ప్రజా జ్యోతి):

పరకాల మున్సిపల్ ఎన్నికలలో 22 వార్డు స్థానాలకు 44 పోలింగ్ కేంద్రాలలో బుధవారం ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పట్టణంలో 11 గంటల వరకు 22% పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లతో ఎటువంటి అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వృద్ధులకు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నారాయణ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *