ఆత్మకూరు లో మేడారం భక్తులకు ఉచిత అన్నదాన శిబిరం
* ప్రారంభించిన సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు దంపతులు
* హర్షం వ్యక్తం చేసిన వేలాది భక్తులు
* అన్న దానం మహా పుణ్యం అని కొనియాడిన సర్పంచ్ దంపతులు
ఆత్మకూరు, జనవరి 28 (ప్రజాజ్యోతి):
మేడారం వెళ్లే భక్తులకు మహా అన్నదానం చేయడం గొప్ప సంకల్పమని ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దంపతులు పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సూర్యమెస్ నిర్వాహకులు శశిధర్ దంపతుల ఆధ్వర్యంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మేడారం వెళ్లే భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు మహేశ్వరి రాజు మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా ప్రతి జాతర సమయంలో మూడు రోజులు జాతరకు వెళ్లే వేల మంది భక్తులకు సూర్య మెస్ నిర్వాహకులు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పార్కింగ్ స్థలాలను సైతం ఏర్పాటు చేసినట్లు శశిధర్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది భక్తులు ఆగి భోజనం చేసి వెళ్లారు. ఈ ఉచిత అన్నదాన శిబిరంలో భోజనం చేసిన వేదాద్రి మంది భక్తులు అన్నదాతలను ఆశీర్వదించి హర్ష వ్యక్తం చేశారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని సర్పంచ్ దంపతులు అన్నదాతలను కొనియాడారు. వేలాది మంది భక్తుల సౌకర్యార్థం గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్న వీరిని గ్రామస్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భయ్యా కుమారస్వామి, తాళ్ల కిరణ్, మిర్యాల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

